Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ నటించిన కొత్త సినిమా 'రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక.
ఛారు బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సుహాస్ మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు ప్రశాంత్ 'కలర్ ఫోటో' సినిమాకి సహాయ దర్శకుడు. తర్వాత 'ఫ్యామిలీ డ్రామా' అనే సినిమా చేశాను. దానికి ప్రశాంత్ రైటర్. 'కలర్ ఫోటో' తర్వాత ఈ కథ చెప్పాడు. సినిమా అంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కి అందరూ బాగా కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇందులో అనుమానమే లేదు. ఫస్ట్ హాఫ్‌లో రెండు, సెకండ్ హాఫ్‌లో మూడు ట్విస్ట్‌లు వస్తాయి. క్లైమాక్స్‌లో ఇంకా మంచి ట్విస్ట్ ఉంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్2లో ఓ సినిమా, 'ఆనందరావు అడ్వంచర్స్' అనే మరో సినిమా చేస్తున్నాను' అని తెలిపారు.