Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం 'సైంధవ్'. గురువారం రామా నాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 'సైంధవ్' రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : శైలేష్ కొలను, సంగీతం: సంతోష్ నారాయణన్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, డీవోపీ: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, ఎడిటర్: గ్యారీ బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.