Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ్ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి 'జీబ్రా' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు.
'లక్ ఫేవర్స్ ది బ్రేవ్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ లాగే టైటిల్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెనిఫర్ పిచినెటో కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్య ఆకుల, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.
టీమ్ 50 రోజుల మొదటి షెడ్యూల్ను పూర్తి చేసింది. మిగిలిన షూటింగ్ హైదరాబాద్, కోల్కతా, ముంబై ప్రాంతంలో ప్లాన్ చేశారు. ఈ పాన్-ఇండియన్ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.