Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శర్వానంద్ త్వరలో తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టనున్నారు. గురువారం ఉదయం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థ మహోత్సవం గ్రాండ్‌గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.