Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ మోషన్ పోస్టర్లో చిరంజీవి ఢమరుకం పట్టుకుని నటరాజ భంగిమలో అచ్చు శివతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ పోస్టర్‌కి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంటెన్సిటీ తెచ్చారు. ఈ సినిమాలో తమన్నా నాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కథా పర్యవేక్షణ: సత్యానంద్, డైలాగ్స్: తిరుపతి మామిడాల.