Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ కృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు.
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఆర్ట్ డైరక్టర్: ఉపేంద్ర రెడ్డి చందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.సి.సతీష్ కుమార్.