Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా రూపొందుతున్న చిత్రం 'మాధవే మధుసూదనా'. బొమ్మదేవర రామచంద్రరావు దర్శక, నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,'ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. అందరినీ మెప్పించేలా ఈ పోస్టర్ ఉంది. సినిమా కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
ఈ మోషన్ పోస్టర్లో సంగీతం, ఆర్ఆర్ వినసొంపుగా ఉంది. పోస్టర్ని బట్టి ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరపై ఆవిష్కరించ బోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అవ్వనుంది. వాసు సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యేలా ఉంది. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.వెండితెరపై మరో అందమైన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే దీమాతో మేకర్స్ ఉన్నారు.
జయ ప్రకాష్, శైలజా ప్రియ, మెకా రామకృష్ణ, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజరు, అంజలి, శ్రీ లత తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సమర్పణ : బొమ్మ దేవర శ్రీదేవి, రచన -దర్శకత్వం : చంద్ర, నిర్మాత : బొమ్మ దేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వాసు, సంగీతం : వికాస్ బాడిస, ఎడిటింగ్ : ఉద్దవ్ ఎస్ బి, మాటలు : బి సుదర్శన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం - బృంద, పాటలు : శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీకృష్ణ.