Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగిసిన అంత్యక్రియలు
నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటీ వీడ్కోలుతో కథానాయకుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి.
'యువగళం' పాత్ర యాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటుకి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ 23 రోజులు మృత్యువుతో పోరాడారు. అయినప్పటికీ ఆయన కన్నమూయడం అందరినీ కలిచివేస్తోంది.
సోమవారం ఉదయం ప్రజలు, సీని, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శానార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ఛాంబర్కి తరలించారు. అనంతరం వైకుంఠ రథంలో ఆయన పార్ధివ దేహాన్ని జూబ్లీహిల్స్‌ని మహాప్రస్థానానికి తీసుకెళ్ళారు.
ఈ వైకుంఠరథంలో చంద్రబాబునాయుడు, బాలకృష్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులున్నారు. తారకరత్నకు కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. మహాప్రస్థానానికి చేరిన అనంతరం తారకరత్న భౌతికకాయాన్ని బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ మోశారు.