Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న సినిమా 'బలగం'.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకుడు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయటానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ''ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం. ఇప్పటికే విడుదలైన 'ఊరు పల్లెటూరు..' సాంగ్, 'పొట్టి పిల్ల' సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు తన ఐడియాను ప్రాపర్‌గా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కి చెప్పటం, అలాగే దానికి అద్భుతమైన లిరిక్స్‌ని కాసర్ల శ్యామ్ అందించారు. మంచి సోల్ ఉన్న సాంగ్స్‌ను అందించారు. మరో రెండు సాంగ్స్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఆ పాటలు వింటే హృదయాలు కదిలిపోతాయి. అంత గొప్పగా ఉంటాయి పాటలు. రిలీజ్ తర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం' అని తెలిపారు.
'దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దిల్ రాజుకి థ్యాంక్స్. త్వరలోనే ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో నారాయణ పాత్రలో మురళీధర్, హీరో మేనత్త పాత్రలో విజయ లక్ష్మి, హీరో తల్లి పాత్రలో స్వరూప, హీరో బాబారు పాత్రలో మొగిలి ఇలా అందరూ దాదాపు కొత్త వారినే పరిచయం చేశాం. ఇక ఇప్పటికే మా మూవీ నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌కు భీమ్స్ ఇచ్చిన సాంగ్స్, దానికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఎక్సలెంట్. పాటలన్నీ శ్యామ్గారే రాశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఓ మంచి సినిమా చేశామనే తృప్తి ఉంది' అని దర్శకుడు వేణు ఎల్దండి చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు, కథా విస్తరణ - స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి - నాగరాజు మడూరి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: మధు, పాటలు: శ్యామ్ కాసర్ల, మాటలు: వేణు ఎల్దండి, రమేష్ ఎలిగేటి - నాగరాజు మడూరి, ప్రొడక్షన్ డిజైన్: రమణ వంక.