Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) హీరోగా, శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మిస్టర్ కింగ్'. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలుగా నటించారు.
ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శశిధర్ చావలి మీడియాతో మాట్లాడుతూ, '''నా ఇష్టం' సినిమాతో సహాయ దర్శకుడిగా నా సినీ ప్రయాణం మొదలుపెట్టాను. అలాగే 'బాహుబలి పార్ట్ 1'కి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశాను. తర్వాత విరించితో కలసి 'మజ్ను' సినిమాకి పని చేశాను. మిస్టర్ కింగ్.. మంచి క్యారెక్టర్ ఉన్న ఓ కుర్రాడి ప్రయాణం. ప్రేమకు సంబంధించిన కథ ఇది. తనకి తప్పు చేయడం రాదు. నమ్మిన దానిపై నిలబడతాడు. తన ప్రేమ ఎలా వుంటుంది?, తను పడే కష్టం ఎలా వుంటుంది?, చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి?, వీటిని బేస్ చేసుకొని రాసి కథ ఇది. నేను రాసుకున్న పాత్రకు శరణ్ కుమార్ యాప్ట్ అనిపించారు. ఈ పాత్రని తను చాలా చక్కగా చేశారు. నిర్మాత బిఎన్ రావుకి కథ చాలా నచ్చింది. ఫాదర్, డాటర్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. క్లైమాక్స్ అందరినీ హత్తుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ సినిమా చూశామనే ఆనందంతో ప్రేక్షకులు బయటికి వస్తారు' అని చెప్పారు.