Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు తిరువీర్, రూపక్ రోనాల్డ్సన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'పరేషాన్'. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ని వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా తీరు వీర్ మాట్లాడుతూ,'ఈ సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఈ సినిమా లాస్ట్ బాల్ స్టేజ్‌లో వుంది. సిక్స్ కోడతామనే నమ్మకం ఉంది' అని అన్నారు.
'ఒక ప్రాజెక్ట్ చేసినపుడు పేరు కోసం, డబ్బు కోసం చేస్తారు. కానీ సినిమా కోసం చేసిన సినిమా పరేషాన్' అని దర్శకుడు రూపక్ చెప్పారు. వాల్తేరు ప్రొడక్షన్స్ నిర్మాతలు మాట్లాడుతూ,'టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది జనం సినిమా. ఈ సినిమాని ప్రేక్షకులకి చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ ఫిల్మ్. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ని కొంచెం కొత్తగా ప్రజంట్ చేసి, కొంత సౌండ్, విజువల్స్‌తో చేసిన సినిమా ఇది' అని అన్నారు.