Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి).
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఈనెల 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకుంది.
ఈ సందర్బంగా దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, 'గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి' అని తెలిపారు.