Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.
ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. 'కళ్యాణ వైభోగమే' చిత్రం తర్వాత నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.
మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి 'కనుల చాటు మేఘమా' అంటూ సాగే మొదటి పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ, 'ఒకప్పుడు నాకు నచ్చిన కాంబినేషన్ వంశీ, ఇళయరాజా.. ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి కాంబినేషన్ శ్రీనివాస్ అవసరాల, కల్యాణి మాలిక్.. వాళ్లిద్దరి కలయికతో వచ్చే సినిమాల్లో పాటలకి ప్రత్యేకత ఉంటుంది.. అందమైన మెలోడీ ఉంటుంది.. ఈ సినిమాలో వారి కాంబినేషన్లో చాలా చక్కటి మెలోడీ ట్యూన్‌కి పాట రాసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం. చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయే పాట' అని అన్నారు.
'కళ్యాణ్ ఒక అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు. లక్ష్మీ భూపాల మంచి సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు. ఇంత మంచి పాటను ఎవరి చేత పాడించాలి అనుకున్నప్పుడు.. ఆభాస్ జోషి గుర్తొచ్చాడు. ఈ పాట చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి' అని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ, 'ఇది నాకు అంత్యంత ఇష్టమైన సినిమా. అంత్యంత మంచి సినిమా. కూడా. 'కనుల చాటు' పాట నాకు ఎంతో ఇష్టమైనది' అని తెలిపారు.