Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారంతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్రాప్ అప్ వీడియోని మేకర్స్ అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఈ వీడియోలో దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. 'చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల' అని చెప్పగా, 'మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్లో కలుద్దాం' అని నాయకానాయికలు నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్, సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్, ఎడిటర్: వెంకట్ రాజన్, డైలాగ్స్: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, యాక్షన్: మహేష్ మాథ్యూ, ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ.