Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రితికా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'ఇన్ కార్'. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాయిక రితికా సింగ్ మాట్లాడుతూ, 'ఇది చాలా సీరియస్, కంప్లీట్ రా ఫిల్మ్. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్ర నాది. చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర' అని తెలిపారు.
'అత్యాచార వార్తలను నిత్యం హెడ్‌లైన్స్‌లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్లైన్స్లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి?, ఎందుకు వాళ్ళు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు?, వాళ్ళ మనస్తత్వం ఏమిటి? అనే అంశాలను ఇందులో చూపించాం' అని దర్శకుడు హర్ష వర్ధన్ చెప్పారు.