Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'భునవ విజయమ్'. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా చిత్రమిది.
వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్లో ప్రధాన తారాగణం సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం. చిత్రానికి రచన, దర్శకత్వం: యలమంద చరణ్, సంగీతం: శేఖర్ చంద్ర, డీవోపీ: సాయి.