Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' సినిమా రూపొందుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ సందర్భంగా సోమవారం రోజు ప్రారంభమైంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ, 'ఇందులో ఓ వపర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే గొప్ప నటుడు కావాలని రజినీకాంత్‌ని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధంతో ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, విష్ణు రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్, నిర్మాత: సుభాస్కరన్, ఎడిటింగ్: బి.ప్రవీణ్ భాస్కర్, ఆర్ట్: రాము తంగరాజ్. ఇదిలా ఉంటే, రజనీ కాంత్ ప్రస్తుతం 'జైలర్' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఇటీవల గ్రీన్‌సిగల్ కూడా ఇచ్చారు. అలాగే మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌కి కూడా ఆయన పచ్చజెండా ఊపేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.