Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా తొలిసారి కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ 'రానా నాయుడు'. తండ్రి కొడుకుల వార్ బ్యాగ్ డ్రాప్లో సాగే ఈ ప్రాజెక్ట్‌ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు.
ఈనెల 10న 'రానా నాయుడు' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రానా మాట్లాడుతూ, 'ఇలాంటి ప్రాజెక్ట్ నాకు, బాబారుకి కొత్త. దీని కోసం బాబారుతో మొదటి రోజు పని చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మర్చిపోలేని అనుభూతి ఇది. నేను ఇప్పటి వరకూ పాజిటివ్, నెగిటివ్ రోల్స్ చేశాను. కానీ ఇందులో ఆ రెండూ ఉన్నాయి' అని చెప్పారు. 'ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కొత్తగా చేయడానికి చాలా స్కోప్ దొరికింది. ఇలాంటి పాత్రని గతంలో ఎన్నడూ చేయలేదు. రానాతో తొలిసారి స్క్రీన్‌ను పంచుకోవడం హైలెట్. హైదరాబాద్ల్ ఉన్న ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్‌స్టర్ పనులు చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉంటాయి. నిజంగా ఇదొక ప్రయోగాత్మకమైన ప్రయత్నం. దర్శకులు కరణ్, సుపర్ణ్ వర్మతో గ్రేట్ జర్నీ. పది ఎపిసోడ్లు ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ చాలా కొత్తగా, పవర్ ఫుల్‌గా ఉంటాయి' అని వెంకటేష్ అన్నారు.