Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎం.ఎం శ్రీలేఖ.. తన 9వ ఏటనే నేపథ్యగానం చేసి, ఆ తరువాత 12 సంవత్సరాల వయసులో దాసరి దర్శకత్వంలో వచ్చిన 'నాన్నగారు' సినిమాతో సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు.
5 భాషల్లో 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా ఆమె సినిమా రంగంలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా భారతదేశంతోపాటు ఖతార్, యు.ఏ.ఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, నార్వే, యుకె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడెన్, ఫిన్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, నైజీరియా, యు యస్ ఏ, కెనడా, సింగపూర్, మలేసియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా 25 దేశాల్లో 25 సింగర్స్‌తో ఈ నెల 17 నుండి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రోగ్రాం స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సిసి కల్చరల్ సెంటర్లో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. 'తన అన్నయ్య కీరవాణి మ్యూజిక్‌లో ఆస్కార్ అందుకోబోతుండగా ఆయన లాగే శ్రీ లేఖ కూడా ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను' అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, 'ఎం.ఎం. శ్రీ లేఖ మంచి మ్యూజిక్ కంపోజర్, మంచి సింగర్. తను చేస్తున్న 25 వరల్డ్ మ్యూజిక్ టూర్ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఎం.ఎం.శ్రీ లేఖ మాట్లాడుతూ, 'సంగీత రంగంలోని స్ట్రగుల్స్ గురించి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక బాగా తెలిసింది. నేను సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నానంటే నా తండ్రులు, మా చిన్నాన్న విజయేంద్రప్రసాద్, డాక్టర్ రామకృష్ణ ముఖ్య కారణం. నా 25 సంవత్సరాల ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇన్నేండ్ల నా జర్నీలో సహకరించిన సింగర్స్, కంపోజర్స్, లిరిసిస్ట్స్ అందరికీ థ్యాంక్స్. నన్ను నమ్మి 25 దేశాలలో పాటలు పాడే అవకాశం ఇచ్చిన రవి కుమార్ మండకి, శ్యామ్ బాబు గంధంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని తెలిపారు.