Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్, తరుణ్ భాస్కర్, బిందు మాధవి, మడోన్నా సెబాస్టియన్, రవింద్ర విజరు, వెంకటేష్ మహా, ఫణి ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'యాంగర్ టేల్స్'. ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై.. నాలుగు భిన్నమైన కథలతో రూపొందిన ఈ ఆంథాలజీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 9నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నితిన్ ప్రభల తిలక్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌కు సంబంధించిన నాలుగు కథలకు నలుగురు సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'దర్శకుడు నితిన్ ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ సిరీస్ నిర్మాణంలో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అంతా బాగా కోపరేట్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కథలతో వస్తాం' అని అన్నారు. 'ఇందులో ఉన్న ప్రతి కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ చెప్పారు. బిందు మాధవి మాట్లాడుతూ, 'ఈ ఆంథాలజీలో యాంగర్ గురించి చెప్పారు. ఇంత మంచి కథ, పాత్రకు నన్ను అనుకున్నందుకు నితిన్‌కు చాలా థ్యాంక్స్' అని తెలిపారు. 'నితిన్ నాతో 'కళాకారుడు' అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఈ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరూ ఆపరు. ఆ స్థాయిలో తీశాడు నితిన్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు ఇస్తాడు అని చెప్పగలను' అని సుహాస్ చెప్పారు. దర్శకుడు ప్రభల నితిన్ తిలక్ మాట్లాడుతూ, 'ఆంథాలజీ కాబట్టి నీరసంగా ఏం ఉండదు. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను' అని అన్నారు.