Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మీటర్'. నూతన దర్శకుడు రమేష్ కడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు బాబీ కొల్లి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా మాస్ మీటర్‌ని సెట్ చేస్తుందని నమ్ముతున్నాను. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అనిపిస్తోంది' అని తెలిపారు. 'చిన్నపుడు ఎలాంటి సినిమాలు చూసి థియేటర్లో విజల్స్ కొట్టి, గోల చేశానో అలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. నన్ను నమ్మి ఇంత పెట్టుబడి పెట్టిన నిర్మాత చెర్రీకి, ఇంత పెద్ద స్క్రిప్ట్‌ని నాతో చేసిన దర్శకుడు రమేష్‌కి థ్యాంక్స్. థియేటర్లో చాలా ఎగ్జైట్ అవుతారు. టీజర్ ఎలా పరిగెట్టిందో సినిమా కూడా అలానే ఆగకుండా మాస్ మీటర్లో పరుగెడుతుంది. సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకూ గోల గోలగా ఉంటుంది' అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన బాబీకి, గోపీచంద్ మలినేనికి కతజ్ఞతలు. ఏప్రిల్ 7న ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది' అని అన్నారు. నిర్మాత చెర్రి మాట్లాడుతూ, 'దర్శకుడు రమేష్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని చేశారు. కిరణ్ కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. సరికొత్త మాస్ అవతార్‌లో ఆయన్ని చూస్తారు' అని తెలిపారు.న