Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్లో శ్రీమతి సునిత సమర్పణలో అజరు శ్రీనివాస్ నిర్మించిన సినిమా 'సిఎస్ఐ సనాతన్'. ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రారు, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ, 'ఈ ట్రైలర్లో సత్తా ఉంది. ఇండిస్టీలో కూడా ఈ మూవీ ట్రైలర్‌పై ఓ పాజిటివ్ డిస్కషన్స్ జరుతున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు అని నమ్ముతున్నాను' అని అన్నారు. 'ఆది అన్నకు ఈ కథ చెప్పగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. తర్వాత కథపై దర్శకుడు దేవ్‌తో కలిసి ఇంకా హార్డ్ వర్క్ చేశాం. మా కెమెరామేన్ శేఖర్ వర్క్, ఆర్ఆర్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ కారు' అని నిర్మాత అజరు శ్రీనివాస్ చెప్పారు. దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ, 'కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఇప్పటికే మన దేశంలో ఇలాంటివి చాలా జరుతున్నాయి. దీంతో ఈ కథ మీ అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు' అని అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ, 'ఓ క్రైమ్ సీన్ పై ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో మా సినిమానే మొదటిది అనుకుంటున్నాను. ఇది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ దర్శకుడు దేవ్‌కు, అలాగే మా నిర్మాత శ్రీనివాస్‌కి పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.