Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీత రాజేందర్, 'ప్లాన్ బి' డైరెక్టర్ కె.వి.రాజమహి నిర్మిస్తున్న చిత్రం 'మూడో కన్ను'. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రం ద్వారా నలుగురు కొత్త దర్శకులు సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు పరిచయం అవుతున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ, 'నాలుగు కథలు, నలుగురు దర్శకులు, కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నాను' అని చెప్పారు. 'కథ అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది' అని మరో ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, 'ఫస్ట్ టైం తెలుగు ఫిలిం చరిత్రలో మా యూనియన్‌లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేస్తున్న మా మెంబెర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని తెలిపారు. నిర్మాతలు కె.వి రాజమహి, సునీత రాజేందర్ మాట్లాడుతూ,'డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న మా చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.