Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాజు గారి గది', 'మంత్ర 2', 'విద్యార్ధి', 'జెంటిల్మేన్ 2 ' ఫేమ్ చేతన్ చేను కథానాయకుడిగా నూతన దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'భీష్మ పర్వం'. ప్రేమ్ కుమార్, చేతన్ చేను నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం గ్రాండ్గా జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎర్రవెల్లి భాస్కర్, ఎర్రవెల్లి ప్రవీణ్, తరుణ్ భాస్కర్, జయశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ దగ్గర్లో 40 అడుగుల కాళీ మాత సెట్ వేసి, వంద మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పీఎంకే ఇంటెర్నేషనల్స్, చేతన్ చేను ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషిని సహౌతా కథానాయిక. అనూప్ శర్మ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విష్ణు విహారి, డీఓపీ: ఈశ్వర్ ఆదిత్య, ఎడిటర్: అమర్ రెడ్డి, లిరిక్స్: అనిరుధ్, ఆర్ట్: ఆనంద్, స్టంట్స్: జాషువా మాస్టర్.