Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిన్ను చూసీ చూడంగా.. నా కన్నె నన్ను దాటి నీ వైపొస్తుందే..'అంటూ ప్రేమికుడు ప్రేయసిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తే, 'కన్నూ కన్ను చాలంట ఆ చూపే చెప్పే సైగలోనే మాయుందే' అని ప్రేయసి తన ప్రేమికుడిని చూసి చెబుతుంది. వీరిద్దరూ సముద్ర తీరంలో తమ .ప్రేమను అందంగా ఒకరిపై ఒకరు వ్యక్తం చేసుకుంటున్నారు. అసలు వీరి మధ్య అంత గాఢమైన ప్రేమ ఎందుకు పుట్టింది?, అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే 'కథ వెనుక కథ' సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం 'కథ వెనుక కథ'.. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'నిన్ను చూసీ చూడంగా ..' అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ సాంగ్ ఇది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను శ్రీకష్ణ, రమ్యా బెహ్రా పాడారు. పూర్ణాచారి పాటను రాశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని, త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.