Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ,నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం'. బి.వి రెడ్డి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు యస్.వి.కష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొని, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్్.వి.కష్ణారెడ్డి మాట్లాడుతూ, 'దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని, చాలా బాగా తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలీ చిన్న, పెద్ద క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా కూడా ఏమాత్రం వెనకాడకుండా పాత్రలో ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన బాబా కొడుకు ఇందులో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. స్క్రీన్ మీద హీరో ధనుష్‌లాగా కనిపిస్తున్నాడు' అని తెలిపారు. 'ట్రైలర్ చూస్తుంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా చేసిన దర్శక, నిర్మాతలకు మంచి పేరు వస్తుంది' అని నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు. ఆలీ మాట్లాడుతూ,'మంచి కంటెంట్‌ను సెలెక్ట్ చేసుకుని, తీసిన దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని చెప్పారు. 'లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని దర్శకుడు శేఖర్ ముత్యాల అన్నారు. హీరో సదన్ మాట్లాడుతూ, 'ఓ మంచి సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని చెప్పారు.
సెకెండ్ కరోనా టైమ్‌లో మా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుండి మేం స్ట్రగుల్ పడుతూ వచ్చాం. చిన్న నిర్మాత అనుకోకుండా ఏ టైమ్‌కి పిలిచినా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఓ మంచి సినిమాని చేసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నాను.
- నిర్మాత బి.వి.రెడ్డి