Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ సినీయర్ నటి మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. తన తల్లి మరణ వార్తను మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనేతో చేసిన ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. 'మా ప్రియమైన వ్యక్తి ఆరు, స్నేహలతా దీక్షిత్, ఆమె ప్రియమైన వారి మధ్య ఈ ఉదయం ప్రశాంతంగా కన్నుమూశారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్నేహలతా అంత్యక్రియలు వర్లీలోని శ్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం జరిగినట్టు సన్నిహితులు తెలిపారు.