Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ తండ్రి తన కొడుకుతో, ఓ అన్న తన తమ్ముడితో, ఓ తమ్ముడు తన అక్కతో.. మాటల్లో చెప్పలేని అసభ్య పదజాలంతో మాట్లాడితే ఎలా ఉంటుంది?, మితి మీరిన అసహజ శృంగారం ఉంటే ఎలా ఉంటుంది? అనే దానికి పక్కా కేరాఫ్‌గా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నిలిచింది. వెంకటేష్ - రానా కలిసి తొలిసారి నటించిన వెబ్‌సిరీస్ 'రానా నాయుడు'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రుతిమించిన శంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న ఇలాంటి సిరీస్‌లో వెంకటేష్, రానా నటించడాన్ని నెటిజన్లు, అభిమానులు తప్పు బడుతున్నారు. రానా- వెంకీ నుంచి ఇలాంటిది ఊహించలేదని, కుటుంబ సభ్యులతో కలిసి సిరీస్‌ను చూడలేకపోతున్నామని విమర్శించారు. ముఖ్యంగా వెంకీ ఇమేజ్ పూర్తి డామేజ్ అయ్యిందని ఫ్యాన్స్ వాపోయారు. దీనికి రానా స్పందిస్తూ, 'ఈ సిరీస్‌ను అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణ చెబుతున్నాం. సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ఒంటరిగా చూడాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు.