Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అరి'. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. 'పేపర్ బారు' ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 చిత్రాలతో పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్‌గా మారిన అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. అలాగే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి ప్యాడింగ్ కనిపిస్తోంది. రీసెంట్గా విడుదలైన మంగ్లీ పాడిన పాట నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ జయశంకర్ మెదటి మూవీ 'పేపర్ బారు' కూడా చాలా బాగా ఆడింది. ఈ మూవీ కూడా కుడా పెద్ద హిట్ కావాలి. ఇలాంటి కథలు చేయాలంటే ధైర్యం చేయాలి. నిర్మాతలకు ఫస్ట్ మూవీ అయినా వారి ప్రయత్నం మెచ్చుకోవాలి' అని తెలిపారు. నిర్మాతల్లో ఓకరైన శేషు మారం రెడ్డి మాట్లాడుతూ, 'మా అరి మూవీ ట్రైలర్ విడుదల చేయడానికి అంగీకరించిన అభిషేక్ అగర్వాల్‌కి థ్యాంక్స్. ఈ అరి సినిమా అనేది వైవిధ్యమైన కథతో వస్తోంది. కథతో పాటు కథనం, సంగీతం హైలెట్ అవుతాయి. మంగ్లీ పాట చాలా పెద్ద హిట్ అయింది' అని చెప్పారు. దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ, 'గత వారం విడుదల చేసిన శ్రీ కష్ణ ఆంథెమ్ పాట అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అలాగే ఈ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. మా నిర్మాతలు శేషు, ఆర్ వీ రెడ్డి సపోర్ట్ మర్చిపోలేనిది' అని అన్నారు.