Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు దేశ, విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగిసాయి. రెండు భారతీయ సినిమాలు ఆస్కార్ గెలుచుకోవడంతో భారతీయ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక 'నాటు నాటు' పాటకు అవార్డు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ బృందంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మూడు నామినేషన్లతో బరిలోకి దిగిన మన దేశం రెండు అవార్డులను దక్కించుకోవడం విశేషం. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలిచి చరిత్ర సృష్టించింది.