Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్కార్ అవార్డుల వేదికను దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ అండర్కరెంట్గా హాలీవుడ్లో పాగా వేయటానికి బాగా ఉపయోగించుకున్నారని కొంత మంది అంటుంటే, హాలీవుడ్ సంస్థలు మన సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్లొక మార్గాన్ని సెట్ చేశారని మరికొంత మంది చెబుతున్నారు. పైగా వీళ్ళ వల్లే తెలుగు సినిమా స్థాయి గురించి మరోమారు అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలుగుతోందని మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా రాజమౌళి తీరే కాదు హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ తీరు కూడా స్వామి కార్యం.. స్వకార్యం అన్న చందానా విస్తృత ప్రచార పర్వం తేటతెల్లం చేసిందనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.