Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపురం స్టూడియోస్ పతాకంపై నేహా ముఖ్యప్రాతలో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన చిత్రం 'లిల్లీ'. రాజ్వీర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శివమ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ఎంకరేజ్ చేస్తున్న శివ కృష్ణ అన్నకి ధన్యవాదాలు. నాకు 'లిటిల్ సోల్జర్స్, అంజలి' సినిమాలు చాలా ఇష్టం. మంచి కాన్సెప్ట్‌తో చిల్డ్రన్స్ మీద సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తుంటే పిల్లలందరూ చాలా బాగా చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నా' అని తెలిపారు.
'దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాం. శివకృష్ణ చాలా మంచి సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించండి' అని నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ, 'మా 'లిల్లీ' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా కంట తడి పెట్టకుండా బయటికి పోరు.కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా తమ పిల్లలకు మా సినిమా చూపించాలని కోరుతున్నాం' అని అన్నారు.