Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్లో నాలుగో సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరి స్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంలో చెంగా రెడ్డి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. 'ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం' వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఆయన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని దర్శక,నిర్మాతలు తెలిపారు.