Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న చిత్రం 'మీటర్'. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మేకర్స్ మొదటి సింగిల్ 'చమ్మక్ చమ్మక్ పోరీని' విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌ను ప్రారంభించారు. హైదరా బాద్‌లోని సంధ్య 70 ఎమ్ఎమ్లో భారీ జనసందోహం సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,' ఈ పాట షూటింగ్ జరిగిన సెట్ చూసి అసలు ఇది మన సాంగేనా ఇంతపెద్ద సెట్లో షూట్ చేయబోతున్నామా అనిపించింది. యూనిట్ అంతా ఇదే ఫీలయ్యాం. దీనికి కారణం నిర్మాత చెర్రీ. నన్ను నమ్మి ఇంత పెద్ద సెట్ వేసిన ఆయనకు కతజ్ఞతలు. సాయి కార్తిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటే కాదు ఇందులో పాటలన్నీ బావుంటాయి. భాను మాస్టర్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. మంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. పరీక్షలన్నీ చక్కగా రాయండి. ఏప్రిల్ 7న మీ కోసం మంచి ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేశాం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీటర్ ఎక్కడా తగ్గదు. సమ్మర్లో మీటర్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్' అని తెలిపారు. 'సాయి కార్తిక్ చాలా మంచి సాంగ్ ఇచ్చారు. జేవీ అద్భుతమైన సెట్ చేశారు. ఈ పాట కోసం యాభై లక్షలు అనుకున్న సెట్ కోటి రూపాయిలు అయ్యింది (నవ్వుతూ). పాట అద్భుతంగా వచ్చింది. రమేష్ చాలా అద్భుతంగా తీశారు. తను చాలా పెద్ద దర్శకుడు అవుతాడు' అని నిర్మాత చెర్రీ చెప్పారు.