Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్టెన్స్ ఎమోషనల్ డ్రామా 'గీత సాక్షిగా'. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 'నాంది' సినిమా దర్శకుడు విజరు కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా హీరో ఆదర్శ్ మాట్లాడుతూ, 'నాకు వండర్ఫుల్ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నిర్మాత చేతన్‌కి థ్యాంక్స్. డైరెక్టర్ ఆంథోని డేడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దానికి తగ్గట్టు మంచి కథ దొరికింది.. మూవీ చేశారు' అని చెప్పారు.
'మహిళా సమస్యలపై తెరకెక్కించిన చిత్రం. నటిగా న్యాయం చేశాను' అని హీరోయిన్ చిత్ర శుక్ల అన్నారు.
నిర్మాత చేతన్ రాజ్ మాట్లాడుతూ, 'మన దేశంలో మహిళలను అమ్మగా పూజిస్తాం. అలాంటి వారిపై దురాగతాలు జరుగు తున్నాయి. ఆంథోని సినిమాను చక్కగా తెరకెక్కించాడు' అని తెలిపారు.
'అమ్మాయిలపై దురాగతాలు జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టులు ఎలా రియాక్ట్ అవుతున్నాయనే దాన్ని రీసెర్చ్ చేశాను. నేను చదివిన చాలా ఘటనల్లో నుంచి ఓ పాయింట్ తీసుకుని ఈ సినిమా చేశాను. ఇది రెగ్యులర్ మూవీ కాదు. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మహిళా సమస్యలపై బాగా ఫోకస్ చేసిన చిత్రమిది. ఇలాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత చేతన్ రాజ్‌కి థ్యాంక్స్' అని దర్శకుడు ఆంథోని మట్టిపల్లి చెప్పారు.