Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 ఏండ్లుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా తమ 25వ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలను అందించనుంది.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, '25 మంది అవార్డు గ్రహీతలకు వెండి మెమోంటోలు ప్రదానం చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది' అని అన్నారు.
'సినీ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలను, అలాగే ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోస్‌కు సత్కారం, జీవిత సాఫల్య పురస్కారాన్ని దర్శకులు రమేష్ ప్రసాద్‌కి అందిస్తున్నారు. బాపు-రమణ అవార్డును హను రాఘవపూడికి, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి ఈశ్వరి రావుకి అందజేయనున్నారు. ఆస్కార్ వాళ్ళు నిర్మాతను గుర్తించకపోయినా 'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్యను మీరు గుర్తించి ఉత్తమ నిర్మాతగా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాతలు ప్రసన్న కుమార్, టి.రామసత్యనారాయణ తెలిపారు.