Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'వైరం'. సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వచ్చిన నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్ చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, బెనర్జీ, కాశీ విశ్వనాధ్ ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దేవరాజ్ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా టీజర్‌కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్‌కు కూడా అంతే బాగుందని చెబుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
'దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో ఈ కథను దేవరాజ్‌కి చెప్పాం. మా కథని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన దేవరాజ్‌కు, తనయుడు ప్రణం దేవరాజ్‌కు థాంక్స్. ప్రణం ఇందులో బాగా చేశాడు. సినిమా బాగా వచ్చింది' అని నిర్మాత జె.మల్లికార్జున తెలిపారు.
చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ, 'ఇది తెలుగు, కన్నడలో బై లింగ్విల్ సినిమాగా చేశాం. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత మల్లికార్జునకి ధన్యవాదాలు' అని చెప్పారు.