Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లాక్ ఏంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ప్రణవ్ సింగంపల్లి, షగ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో హీరో సాగర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,'దర్శకులు శ్రీనాథ్‌తో నా జర్నీ 'కృష్ణా రావ్ సూపర్‌మార్కెట్' సినిమాతో ప్రారంభమైంది. మంచి ప్యాషన్ ఉన్న దర్శకుడు శ్రీనాథ్. ఇదొక అద్భుతమైన ప్రేమ కథ.. అందరినీ కదిలించే కథ' అని చెప్పారు. 'ఇది రాయలసీమలోని పుంగనూరు అనే గ్రామం బ్యాక్ డ్రాప్‌గా జరిగే ఇంటర్మీడియట్ టీనేజెర్స్ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. కో-డైరెక్టర్ వంశీ, సంగీత దర్శకుడు కార్తిక్, మా నిర్మాత నాకెంతో సహకరించారు' అని దర్శకుడు చెప్పారు.