Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో విశ్వక్ సేన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. నివేదా పేతురాజ్ నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మీడియాతో ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.
విశ్వక్‌తో 'పాగల్' చేస్తున్నప్పుడే 'ఓరి దేవుడా'కి కాల్ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడంతో మరింత స్పెషల్‌గా మారింది.
ఇలాంటి పాత్రలో నేను గతంలో కనిపించలేదు. కెరీర్లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపిం చింది. చాలా గ్లామరస్ రోల్. బాగా ఇష్టపడి చేశాను.
హీరో, నిర్మాత, దర్శకత్వం ఇలా మూడు బాధ్యతలను విశ్వక్ తీసుకుని పూర్తి న్యాయం చేశారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అంత ఎనర్జీ ఉన్న దర్శకుడిని విశ్వక్లోనే చూశాను.
ఇదొక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. విశ్వక్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుంది. అలాగే తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగానూ నిలుస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం కథ. తర్వాత నటీనటులు. రావు రమేష్ చాలా అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి.నాకూ దర్శకత్వం చేయాలనే ఉంది. అయితే ఇప్పుడే కాదు. నటనతో పాటు బిజినెస్‌పై కూడా దృష్టి పెడుతున్నా. చెన్నైలో ఓ రెస్టారెంట్‌ని ఇప్పటికే ప్రారంభించా.