Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న సినిమా 'అథర్వ'. మహేష్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ని హీరో ఆకాష్ పూరి, క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్, ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించి, సినిమాపై అంచనాలను పెంచింది' అని అన్నారు. 'క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్‌తో పాటు లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కోణాలు ఉన్నాయి' అని దర్శకుడు చెప్పారు. హీరో మాట్లాడుతూ, 'ఈ సినిమా క్లూస్ టీమ్ పై ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఖర్చు పెట్టి తియాలంటే ఏ నిర్మాతకైనా గట్స్ ఉండాలి. 50 లక్షలతో క్లూస్ సెట్ వేశారు' అని అన్నారు.