Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సృజనాత్మక పేరిట హద్దులు మిరితే చర్యలు
కరోనా అనంతరం ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను వాడే వారి సంఖ్య కూడా అధికమైంది. ప్రతి ఒక్కరి దగ్గర నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ లేకపోవడంతో అసభ్య పదజాలం, మితి మీరిన శృంగారానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. సృజనాత్మక పేరిట హద్దులు మిరితే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వానికి విపరీతంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇకపై సృజనాత్మక పేరిట అసభ్య పదజాలాన్ని వాడితే సహించేది లేదు అని అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు.
ఇదిలా ఉంటే, ఇటీవల వెంకటేష్, రానా కలిసి నటించిన 'రానానాయుడు' వెబ్‌సిరీస్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిరీస్ మొత్తం బూతులు, అసాధరణ అశ్లీల దృశ్యాలు ఉన్నాయని, ఇలాంటి సిరీస్‌లో మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఎలా నటించారని?, అసలు అలాంటి బూతులు ఆయన నోటి నుంచి ఎలా వచ్చాయని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీటికి స్పందించి రానా ఇప్పటికే క్షమాపణలు తెలిపారు.
ఈ సిరీస్‌పై నెటిజన్లే కాదు సీనియర్ నటీనటులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవలే విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్ చూసిన తర్వాత.. ఓటీటీలలో వచ్చే కంటెంట్‌కి కూడా కఠినమైన సెన్సార్ విధానం ఉండాలని అర్థమైంది. మహిళా వ్యతిరేకత తీవ్రమై ఉద్యమాల చేసే వరకు తెచ్చుకోకుండా ఉంటారని అనుకుంటున్నా.
- విజయశాంతి
నేను ఓటీటీలో రీసెంట్గా ఓ సిరీస్ చూశాను. ఆల్ మోస్ట్ అది బ్లూ ఫిల్మే. ఓటీటీల్లో ఇలాంటివి అవసరమా?, పైగా మంచి ఇమేజ్ ఉన్న నటీనటులు నటించడమేంటి?, చెత్త కంటెంట్లతో మన సంస్కృతి, సాంప్రదాయాలు ఖూనీ చేస్తున్నారు. ఈ సిరీస్‌ని ఓటీటీ నుంచి తొలగించాలని కోరుతున్నా. ఓటీటీకి కూడా కచ్చితంగా సెన్సార్ చేయాల్సిందే.
- శివకృష్ణ