Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తాడ్వాయి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోమంగళవారం రోజున కామారెడ్డి బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వనం గంగాధర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన బహుజనలందరం ఒకటైతే రాజ్యాధికారం వస్తుందన్నారు. బీసీ జనగణ తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని, అప్పుడే ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ లెక్కలు తీయాలి అని అన్నారు.
భారతదేశంలో అడవిలో ఉన్న జంతువులకు కుక్కలకు, నక్కలకు, పులులకు, సింహాలకు, లెక్కలు ఉన్నాయి. కానీ బీసీ లెక్కలు లేకపోవడం చాలా విచారకం అన్నారు. ఈ నెల మార్చి 28, 29 రెండు రోజులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు ఉన్నాయి అని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 1000 మంది 33 జిల్లాల నుండి వెళ్తున్నారన్నారు. ఇట్టి కార్యక్రమంలో బి.సి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సాప శివరాములు నేత, జిల్లా ఉపాధ్యక్షులు మారాజు మోహనాచారి, CH రాజయ్య, MD అబ్దుల్ అజీజ్, కామారెడ్డి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి వడ్ల సురేష్ కుమార్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాయ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి P. ప్రవీణ్ కుమార్, కామారెడ్డి మండల అధ్యక్షులు G. అంజయ్య, వడ్లూర్ Ex. సర్పంచ్ రాములు, తదితరులు బహుజన నాయకులు పాల్గొన్నారు.