Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత, సీనియర్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ప్రమోద్‌కుమార్ (87) మంగళవారం విజయవాడలో కన్నుమూశారు.38 సంవత్సరాల సినీ ప్రస్థ్థానంలో ఆయన 300లకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా వ్యవ హరించారు. అందులో
31 సినిమాలు శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. కొన్ని చిత్రాల్లో నటుడిగా అతిథి పాత్రల్లో కనిపించారు. అలాగే మోహన్‌బాబు 'దొంగ పోలీస్'తో పాటు 'గరం మసాలా' చిత్రాల్ని నిర్మించారు. 'సుబ్బయ్య గారి మేడ' పేరుతో ఓ నవలని, తన సినిమా అనుభవాలను 'తెర వెనుక తెలుగు సినిమా'గా ఓ పుస్తకం రాశారు. ఇది నంది పురస్కారానికి ఎంపికైంది. వ్యక్తిగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఆయన తన బాధ్యతను నిర్వర్తించారని ప్రమోద్‌కుమార్ తనయుడు శ్రీనివాస్ రారు తెలిపారు. ప్రమోద్ కుమార్‌కు కుమారుడు శ్రీనివాస్రారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిర్మాత, పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ప్రమోద్‌కుమార్ మృతి పట్ల డిజైనర్స్ అసోసియేషన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.