Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'భోళా శంకర్'. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఉగాది పండగని పురస్కరించుకుని మేకర్స్ మెగా అభిమానులకు మంచి అప్డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 11, 2023న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా ముగ్గురూ పండగ కళ ఉట్టిపడేలా అందంగా ఉండటం విశేషం. ఇప్పటికే విడుదలైన 'భోళా శంకర్' ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.