Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తాజాగా నటించిన చిత్రం 'రావణాసుర'. సుధీర్ వర్మ
దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్‌లో ఒకరైన ఫరియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించారు. 'ఇందులో నా పాత్ర పేరు కనకమహాలక్ష్మీ. లాయర్‌గా నటించా. రవితేజ నాకు సీనియర్ లాయర్. క్యారెక్టర్లో చాలా వెరైటీ కలర్స్ ఉంటాయి. కథతో పాటు మారే పాత్ర నాది. నటించడానికి మంచి స్పాన్ ఉన్న పాత్ర. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నాం. అందరివి భిన్నమైన పాత్రలు. రవితేజతో పని చేయడం నెక్స్ట్ లెవల్ ఎక్స్పీరియన్స్. దర్శకుడు సుధీర్ వర్మ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. 'రావణాసుర'లో సీత ఎవరనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అప్పటివరకూ సస్పెన్స్ (నవ్వుతూ). పాత్రల పరంగా నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. నెగటివ్, యాక్షన్, పీరియాడిక్ ఇలా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. అలాగే దర్శకత్వంతోపాటు నిర్మాణం కూడా చేస్తాను. అయితే వాటికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళంలో సినిమాలు చేస్తున్నా' అని తెలిపారు.