Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్య కేసు నమోదు చేసినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..అంబేద్కర్ కాలనీ, నిజామాబాద్ కు చెందిన ఎనుగందుల రాములు, వయస్సు 52సం. అను అతడు కూలీ పని చేస్తూ జీవిస్తాడు. ఈనెల తేదీ 06.03.2023 నాడు ఉదయం 9.30 గంటలకు ఇంటినుండి పనికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రానందున తన భార్య ఎనుగందుల గంగామని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోటో లోని వ్యక్తి వివరాలు గురించి తెలిసినచో, అట్టి సమాచారాన్ని టౌన్-3 పోలీస్ స్టేషన్, నిజామాబాద్ ఎస్సై ఫోన్ నం.8712659839 లేదా 08462220350 కు తెలుపగలరు అని మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలియజేశారు.