Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'స్లమ్ డాగ్ హజ్బెండ్'. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయనుండటం విశేషం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను హీరో విజరు దేవరకొండ విడుదల చేశారు. గతంలోనే అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్‌కు, అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన ఫ్రస్ట్రేషన్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ పై సాగే ఈ పాటలో సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ సర్ప్రైజ్ చేసింది. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 'ఓ పిట్టకథ' చిత్రంతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న సంజరు రావుకు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదలకు చేస్తామని మేకర్స్ తెలిపారు.