Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో 20 ఏండ్ల క్రితం ముగ్గురు మహిళల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా లవ్ అండ్ క్రైమ్ కథతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.యఫ్.సి క్రియేషన్స్ పతాకంపై హరి మేఘామ్స్, రవితేజ, హనీ నటీటులుగా కొప్పుల చిన్నయ్యని దర్శకుడిగా పరిచయం చేస్తూ, తునికి హరికష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ నూతన చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రఘుబాబు క్లాప్ కొట్టగా, నిర్మాత శ్రీ రంగం శ్రీనివాసులు కెమెరా స్విచాన్ చేసారు. టి.యన్.జి.ఓ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొప్పుల చిన్నయ్య మాట్లాడుతూ,'అభ్యుదయంగా ఎదగాలనుకున్న స్త్రీకి పురుషుడు ప్రతిసారి ఏదో రకంగా అడ్డు పడుతూనే ఉంటాడు. అలాంటి సమయంలో వారు ఎలాంటి అవస్థలకు గురవుతున్నారనే కథే ఈ సినిమా. సినిమాలో బాల్యం, కౌమారం, యవ్వన దశలలో ముగ్గురు మహిళలు వారి జీవితాలలో ఎదుర్కొన్న యదార్థ కథలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. తెలంగాణలోని నిర్మల్, ఖానాపూర్, జిన్నారం పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం చేస్తాం' అని తెలిపారు. 'తెలంగాణ సంస్కతికి అద్దం పట్టేలా ఉండే ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ స్లాంగ్‌లోనే ఉంటుంది. రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం' అని చిత్ర నిర్మాత తునికి హరికష్ణ అన్నారు. పాటల రచయిత దాసండ్ల అంజయ్య మాట్లాడుతూ, 'ఈ సినిమాకి ఐదు పాటలు రాశాను. పాటలు చాలా బాగా వచ్చాయి. అందరికీ నచ్చే కథాంశమిది' అని చెప్పారు.