Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో జివివి గిరి నిర్మించిన చిత్రం 'పరారీ'. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని 'ఏమో ఏమో సాంగ్'ని విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'యోగిశ్వర్కి మొదటి సినిమా అయినా డాన్స్ బాగా చేసాడు. సక్సెస్ అవుతాడు. ఈ సినిమాను కూడా అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను' అని చెప్పారు. 'మార్చి 30న గ్రాండ్‌గా మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత జి.వి.వి.గిరి తెలిపారు. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ,'పాటలు అన్ని బాగా వచ్చాయి. మార్కెట్లోకి రిలీజైన మా పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది' అని అన్నారు. 'విజయశాంతి నా డాన్స్‌లను మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. డిఫరెంట్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని హీరో యోగేశ్వర్ అన్నారు.