Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఈ సినిమా ఉగాది రోజున ఘనంగా ఆరంభమైంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశారు. నిర్మాతలు జెమినీ కిరణ్, శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ,'ఇది చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్ డ్రామా అన్నీ ఇందులో ఉంటాయి. ఏప్రిల్ 10 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది' అని తెలిపారు. 'నరేష్‌తో పని చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. సినిమా అదిరిపోతుందనే నమ్మకం ఉంది' అని నాయిక ఫరియా అబ్దుల్లా చెప్పారు. నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ,'దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు ఈ కథకు నరేష్ గారు మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. నరేష్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. దర్శకుడు మల్లి మాట్లాడుతూ,'ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతకు కతజ్ఞతలు. అబ్బూరి రవి నా కథని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అందరూ గర్వపడే సినిమా చేస్తాను' అని తెలిపారు.